Actress Pragathi: సినీ ప్రియులకు యాక్టర్ ప్రగతి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాబీ సినిమాతో నటిగా తెలుగు ఇండస్ట్రీలో కాలుమోపిన ప్రగతి ఆపై ఎన్నో సినిమాల్లో నటించి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరో తల్లి పాత్రలకు గాను ప్రగతి ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టు కుంది.
ఏమైంది ఈ వేళ సినిమాలో ఆమె చేసిన హీరో తల్లి రోల్ కి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం తన సొంతం చేసుకుంది. ఇక తాజాగా డీజే టిల్లు సినిమాలో కనిపించిన ప్రగతి తన నటనతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది. ప్రగతి మొత్తానికి నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ప్రగతి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది. ఇక మోడల్ డ్రెస్సులు, హాట్ సారీ లు కట్టుకుంటూ సోషల్ మీడియా ప్రియులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ప్రగతి సోషల్ మీడియాలో పోస్ట్ పంచుకున్నా.. అది నిమిషాలు పరంగా వైరల్ అవ్వక తప్పదు. దాదాపు ఆరు పదుల వయస్సుకు వచ్చినప్పటికీ ఇప్పటికీ తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తునే ఉంటుంది.

Actress Pragathi: ప్రగతి పంచుకున్న ఆ పోస్ట్ లో ఈ విధంగా కనిపిస్తుంది!
ఇక ఇదే క్రమంలో ప్రగతి తాను జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలలో ప్రగతి ఎంతో హాట్ గా కనిపిస్తుంది. ఈ పోస్ట్ చేసి 19 గంటలు పూర్తి కాగా ఇరవై నాలుగు వేలకు పైగా ఇష్టాలను పొందింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ప్రగతికి ముద్దుగా కామెంట్లు విసురుతున్నారు. సో సెక్సీ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. సో హాట్ అంటూ మరొకరు కితాబిస్తున్నారు. మొత్తానికి ప్రగతి ప్రస్తుతం తన పోస్టులతో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. మరికొందరు ఈ పోస్టులు చూసి కామెంట్ల రూపంలో నోరు వెళ్ళబెడుతున్నారు.