Actress Pragathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా సినిమాలలో అక్క, అమ్మ, అత్త, వదిన వంటి పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో ప్రగతి కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రగతి బిజీగా ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రగతి యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో ప్రగతి షేర్ చేసే పోస్టుల వల్ల బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ప్రగతి తన వర్కౌట్ వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. లేటు వయసులో కూడా కష్టతరమైన వర్కౌట్లు చేస్తూ కొంతమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అయితే కొన్ని సందర్భాలలో ప్రగతి జీవితానికి సంబంధించిన విషయాల గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో ప్రగతి ఏ పోస్ట్ షేర్ చేసిన కూడా అవి నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా చేతిలో మందు గ్లాసు పట్టుకుని ఉన్న ఫోటోని ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక కొటేషన్ రాసుకొచ్చింది. తాజాగా ప్రగతి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Actress Pragathi: ఆశతో ప్రయత్నిస్తే అన్నీ అవుతాయి…
ఈ పోస్ట్ లో ప్రగతి ” జీవితంలో అనుకున్నది సాధించటం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, మనం అనుకున్నది సాధించగలమని ఆశతో ప్రయత్నిస్తే అన్ని సరైన సమయంలో జరుగుతాయి. జీవితంలో మనం అనుకున్నది సాధించేవరకు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు” అంటూ రాసుకొచింది. అయితే చేతిలో మందు గ్లాసు పట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ప్రగతి ఇలా రాయటంతో అసలు ప్రగతి దేని గురించి ఇలా రాసింది అంటూ నేటిజన్స్ సందిగ్ధంలో ఉన్నారు. మందు గురించి ఇలా రాసిందా ? లేక వేరే విషయం గురించి రాసిందా ? అంటూ చర్చించుకుంటున్నారు.