Actress purnaa: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన పూర్ణ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిమంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత కొంతకాలానికి సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేసింది. ఇక ప్రస్తుతం పూర్ణ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. దుబాయ్ కి చెందిన షాహిన్ అసిఫ్ అలీ అనే ప్రముఖ వ్యాపారవేత్తను 2022 జూన్ లో పూర్ణ వివాహం చేసుకుంది.
అయితే ఈ వివాహం గురించి పూర్ణ చాలా గోప్యంగా ఉంచింది. వివాహం జరిగిన కొంతకాలానికి పెళ్లి విషయం అధికారికంగా ప్రకటించింది. కొన్ని కారణాలవల్ల అత్యంత సన్నిహితుల మధ్య పూర్ణ వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. వివాహం జరిగిన కొంతకాలానికి తాను తల్లి కాబోతున్నట్లు అందరికీ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పూర్ణ 9 నెలల గర్భంతో ఉంది. కొన్ని రోజులలో పండంటి బిడ్డకు జన్మని ఇవ్వబోతోంది. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పూర్ణ.. తన గురించి తన కడుపులో బిడ్డ గురించి ఆలోచించకుండా చేసిన ఒక పని వల్ల ప్రస్తుతం అందరూ ట్రోల్ చేస్తున్నారు.
Actress purnaa: చంకీల అంగీలేసి అంటూ డాన్స్ చేసిన పూర్ణ…
ఇటీవల విడుదలైన దసరా సినిమాలోని చంకీల అంగీలేసి అనే పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. ఇక తాజాగా 9 నెలల గర్భవతిగా ఉన్న పూర్ణ కూడా ఈ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. గర్భవతిగా ఉన్న సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పూర్ణ ఇలా డాన్స్ చేయడంతో నెటిజన్స్ ఆమె చేసిన పనికి మండిపడుతున్నారు. ప్రస్తుతం పూర్ణ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.