Actress Roja: తెలుగుతో పాటు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రోజా. సినిమాలకు గుడ్ బై చెప్పి పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. పలు షోలకు గెస్ట్ గా పాల్గొంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. మరోవైపు ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా, మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలతో చెలరేగిపోతూ ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకుంటున్నారు.
వైసీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు జగన్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చింది. పర్యాటకశాఖ మంత్రిగా ఆమెకు అవకాశం దక్కింది. దీంతో జబర్దస్త్ షో జడ్జిగా ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలో పోసాని కృష్ణమురళి లాంటి వారు జడ్జిలుగా వచ్చారు. అయితే రోజా ఎన్నో అవమానాలు, ట్రోల్స్ ను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది.
అయితే రోజా కూతురు కూడా అలాంటి ట్రోల్స్‌ను ఎదుర్కొంటుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కూతురిపై వస్తున్న ట్రోల్స్ పై రోజా స్పందిస్తూ ఆవేదనకు గురైంది. కొంతమంది సోషల్ మీడియలో తన కూతురి ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర కామెంట్లు పెడుతున్నారంటూ రోజా బాధపడింది. సోషల్ మీడియాలో వచ్చే ఫొటోలను చూసి తన కూతురు బాధపడిందని, తన కూతురు చాలా సెన్సిటివ్ అని రోజా చెప్పింది. ఇలాంటివి అన్ని మనకు అవసరమా అంటూ మొహం మీద తనను అడిగిందిన రోజా తెలిపింది.
Actress Roja:
సెలబ్రెటీలకు, సెలబ్రెటీల ఫ్యామిలీలకు సంబంధించి ఇలాంటివి కామన్ అని, అవి పట్టించుకుంటే ముందుకెళ్లలేమని తన కూతురుకు చెప్పినట్లు రోజా స్పష్టం చేసింది. తన కూతుళ్లకు తాను సర్దిచెప్పాననంటూ రోజా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోజా కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె అభిమానులను బాధిస్తుంది.