Actress Sita: ఒకప్పటి తెలుగు సినీ నటి సీత గురించి అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. పైగా నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అప్పట్లోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈమె సీనియర్ నటుడు పార్థిబన్ ను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో 2001లో అతడి నుంచి విడిపోయింది. ఇక 2010లో టీవీ నటుడు సతీష్ ను వివాహం చేసుకుంది. నిజానికి ఆమె సతీష్ ని పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం ఎవరో చెప్పలేదు స్వయంగా సతీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో పంచుకున్నాడు.
తన భర్తతో ఆమె విడాకులు తీసుకున్న తర్వాత ఒక సీరియల్ సమయంలో వీరి మధ్య పరిచయం పెరిగింది అని ఆ పరిచయం కూడా మంచి స్నేహం లాంటిదని అన్నాడు. అంతే కానీ తమకు పెళ్లి కాలేదు అని కానీ అందరూ తమకు పెళ్లి అయింది అని అంతేకాకుండా విడాకులు కూడా తీసుకున్నాము అని రాశారని అన్నాడు. ఇక అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని ఆ తర్వాత తాము మాత్రం ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నామని అన్నాడు.

Actress Sita: సీతతో తనకున్న అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చిన సతీష్..
ఇక వారిది వివాహ బంధం కాదని తమది మంచి స్నేహబంధం అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా గతంలో సీత కోట్ల ఆస్తులు మీ వల్ల పోయాయని ఇంటర్వ్యూర్ ప్రశ్నించగా వెంటనే సతీష్ నవ్వుతూ అలా కాలేదు అని అదంతా మీడియా డెవలప్మెంట్ కోసం రాశారు అని అంతే కాకుండా ఆ వార్తలు చూసి నేను, సీత బాగా నవ్వుకున్నాము అని అన్నాడు. ఇప్పటికీ తమది మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అని తమ మధ్య ఎటువంటి పెళ్లి కానీ, విడాకులు కానీ జరగలేదు అని అన్నాడు.