Actress Sithara: చిన్న వయసులోనే అవన్నీ కోల్పోయాను.. సినీ నటి సితార వైరల్ కామెంట్స్!

Akashavani

Actress Sithara: తెలుగు ప్రేక్షకులకు నటి సితార గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తన చీరకట్టుతో అచ్చం తెలుగింటి ఆడపడుచుల కనిపించడం తనలోని ప్రత్యేకత. మనసు మమత సీరియల్ ద్వారా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన ఆమే తెలుగు ప్రేక్షకులను మరో మరో లెవెల్ లో ఆకట్టు కుంది.

అనంతరం శ్రీవారి చిందులు సినిమాలో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సినిమాలో సహాయ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులతో అద్భుతమైన ర్యాపో పెంచుకుంది ఈమె. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సితార బుల్లితెరపై హడావిడి చేస్తోంది.

ఇదిలా ఉంటే సితార తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. తాను చిన్న వయసులోనే హీరోయిన్ కావడంతో చాలావరకు టీనేజ్ లైఫ్ ను మిస్ అయినట్లు తెలిపింది. ఇక కాలేజీ కి వెళ్ళినా.. నా ఆలోచన మొత్తం సినిమాలతోనే నిండి ఉండేదని సితార చెప్పుకొచ్చింది.

Actress Sithara: చిన్న వయసులోనే అవన్నీ కోల్పోయాను.. సినీ నటి సితార వైరల్ కామెంట్స్!Actress Sithara: చిన్న వయసులోనే అవన్నీ కోల్పోయాను.. సినీ నటి సితార వైరల్ కామెంట్స్!
Actress Sithara: చిన్న వయసులోనే అవన్నీ కోల్పోయాను.. సినీ నటి సితార వైరల్ కామెంట్స్!

Actress Sithara: హఠాత్తుగా ఇతను చనిపోవడం సితార కు తీరని లోటు అనిపించింది!

దాంతో సినిమాలలోనే బిజీగా ఉండడంతో ఆ దశను పూర్తిగా ఎంజాయ్ చేయలేక పోయానని తెలిపింది. ఇక హఠాత్తుగా నాన్న చనిపోవడంతో చాలా లోటు అనిపించిందని బాధపడింది. ప్రస్తుతం సీతారా తన లైఫ్ జర్నీ గురించి చెప్పిన ఆ విషయాలు యూట్యూబ్ లో వైరల్ గా మారాయి.

ఇక సితార ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తులసి ఫ్రెండ్ పాత్రలో సితార బుల్లితెర ప్రేక్షకులను గత కొన్ని రోజులుగా బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి సితార అటు వెండి తెరపై ఇట బుల్లితెరపై బాగా సందడి చేస్తుంది.

- Advertisement -