Actress Tabu: బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి టబు ఒకరు.ఈమె కూలి నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి ఎంతో సందడి చేశారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి టబు ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో తన అందానికి ఎంతోమంది అభిమానులు ఉండేవారు అయితే వయసు పైబడుతున్న కొద్దీ అందం తరిగిపోతుంది కానీ టబూ విషయంలో మాత్రం వయసుతోపాటు ఈమె అందం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈమె ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ నేటితరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తన గ్లామర్ మెయింటెన్ చేస్తుంది.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి టబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
Actress Tabu అంతం విషయంలో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్న టబు..
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా టబూ ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఎంతో అందంగా ముస్తాబై కనిపించారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. నీలిరంగు చీర కట్టుకొని ఎంతో అందంగా ఉన్నటువంటి టబు క్యారవాన్ నుంచి నడిచి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు టబూ అందాన్ని తమ కెమెరాలలో బంధించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.