Actress: ఆమె చేస్తే ఒప్పు నేను చేస్తే తప్ప అంటూ సమంతతో పోల్చుకున్న నటి.. కానీ కథే వేరు!

Akashavani

Actress: సినీ లవర్స్ కు ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. పలు వివాదాలను తట్టి లేపడం లో సంచలనానికి మారు పేరని చెప్పాలి. ఇక బాలీవుడ్ బుల్లితెర ఎంట్రీతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక మేరీ దుర్గ్ అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అదే క్రమంలో పలు సీరియల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి బి టౌన్ లో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్ లో ఎంపికై అడపాదడపా కొంతవరకూ గుర్తింపు సంపాదించుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతో కాలం మెప్పించలేకపోయింది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే కొంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎలాగైనా ఫేమ్ సంపాదించుకోవాలన్నా ఆలోచనలో వెరైటీ దుస్తులు, హాట్ హాట్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది.

ఉర్ఫి పంచుకునే హాట్ పోస్ట్లు నెటిజన్లను మరో లెవెల్ లో ఆకట్టుకుంటాయి. ఇలాంటి డ్రెస్సులు వేయడం వల్ల ఉర్ఫి ట్రోల్లర్స్ నోట్లో నానుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తనలా పలుచటి బట్టలతో వేసుకున్న వాళ్ళని పొగుడుతూ.. నన్ను మాత్రం ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

Actress: ఆమె చేస్తే ఒప్పు నేను చేస్తే తప్ప అంటూ సమంతతో పోల్చుకున్న నటి.. కానీ కథే వేరు!
Actress: ఆమె చేస్తే ఒప్పు నేను చేస్తే తప్ప అంటూ సమంతతో పోల్చుకున్న నటి.. కానీ కథే వేరు!

Actress: ఉర్పి డ్రెస్ గురించి కొందరు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు!

ఆమె లానే పలుచటి షర్ట్ వేసుకున్న సమంత లుక్ లో ఇంటర్నేషనల్ టెంపరేచర్ పెంచేలా ఉంది అన్న వార్తను, ఆమే వేసుకున్న డ్రెస్ మాత్రం దోమ తెర కన్నా పలుచగా చాలా దరిద్రంగా ఉంది అని జనాలు తిడుతున్నారు. దీంతో ఆ రెండు వార్తలను స్క్రీన్ షాట్ తీసి ఉర్పి తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. ఈ విధంగా సమంతతో పోల్చుకొని.. సమంత పట్ల దురుద్దేశం గా పెట్టలేదని తెలిసింది.

- Advertisement -