Actress Yamuna: మౌన పోరాటం సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ టైం దక్కించుకున్న సీనియర్ నటి యమున. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మోడద మరెయల్లి అనే కన్నడ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన యమున అసలు పేరు ప్రేమ. దర్శకుడు కే బాలచందర్ ఈమె పేరుని యమునగా మార్చాడు. ఆ రోజుల్లో ఈమె ఏడుపు చిత్రాలు, డి గ్లామరైజ్డ్ చిత్రాల్లో నటించేది.
సినిమాలు తగ్గిన తర్వాత కూడా ఆమె హవా సీరియల్ ద్వారా కొనసాగించింది. ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత, విధి సీరియల్స్ ఆమెకి మరింత పేరుని తీసుకువచ్చాయి. ఈమె వివాహం తర్వాత కొంతకాలం సినిమాల్లో నటించడం మానేసింది. 2011లో బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్లో ఐటీసీ రాయల్ గార్డెన్యాలో జరిగిన పోలీస్ దాడిలో వ్యభిచార ఆరోపణలపై అరెస్టు అయ్యి బాగా ట్రోలింగ్ కి గురైంది.
అయితే ఇదంతా తనపై వచ్చిన ఆరోపణలని కోర్టు కొట్టు వేసినట్లుగా ఆమె తెలియజేసింది. మౌన పోరాటం సినిమా కోసం చాలామంది హీరోయిన్స్ ని చూశారని, ఆ పాత్రకి నేనైతేనే సరిపోతానని నన్ను సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది యమున. తనకి ఎర్రమందారం, మామగారు సినిమాలు కూడా అంతే పేరుని తీసుకువచ్చాయని చెప్పింది.
మౌన పోరాటం సినిమా తరువాత ఈమె కెరియర్ పీక్స్ లోకి వెళ్తుందని అందరూ ఊహించారు కానీ అందుకు విరుద్ధంగా ఆమె చిన్న సినిమాల్లోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆందుకు ఆమె అనుకున్నంత సక్సెస్ ని తెలుగులో సాధించలేకపోయింది. ఈమధ్యనే ఆమె ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు కారణాన్ని చెప్పుకొచ్చింది.
Actress Yamuna:
తను ఎక్కువగా డిగ్లామరైజ్డ్ చిత్రాలను చేయటం వల్ల గ్లామరస్ రోల్స్ చేయలేననే భావన అందరిలోనూ ఏర్పడిందని ఒకరకంగా డి గ్లామరైజ్డ్ రోల్స్ చేయటం నా కెరియర్ కు మైనస్ అయిందని చెప్పుకొచ్చింది. ఆ విషయం తనని ఇప్పటికీ బాధిస్తుందని, అయితే ప్రస్తుతం తను చేస్తున్న సీరియల్స్, సినిమాలు తనకి సంతృప్తినిస్తున్నాయని ఆ ఇంటర్వ్యూలో యమున చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం మౌన పోరాటం సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సీరియల్ పేరు కూడా మౌన పోరాటం కావటం విశేషం అది ఈటీవీలో ప్రసారం అవుతుంది.