Adivi Sesh: ఇంత అవమానించారా..ఇంకో హీరో అయితే ఇండస్ట్రీనే వదిలేసేవాడు..!

Akashavani

Adivi Sesh: సినిమా ఇండస్ట్రీలో నటుడవ్వాలంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనివాడికి మాత్రమే కాదు, కాస్తో కూస్తో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాడికి
అవమానాలు తప్పవు. అలాగే, టాలెంటెడ్ నటుడు అడవి శేష్‌ (Adivi Sesh)ను కూడా ఎంతగానో అవమానించారట. నిజంగా ఇంకో హీరో అయితే
ఇండస్ట్రీనే వదిలేసేవాడు. కానీ, పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనుకునే కసి, తాపత్రయంతో కష్టపడి అంచలంచెలుగా ఎదిగి ఈరోజు పాన్ ఇండియన్
సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటున్నాడు.

శేష్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ (Major) రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో
భాగంగా శేష్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాడు. అలా తాను చెప్పిన విషయాలు ఇప్పుడు
నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) రూపొందించిన సినిమా చందమామ (Chandamama).
ఇందులో కాజల్ అగర్వాల్, నవదీప్, శివ బాలాజీ, సింధు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Adivi Sesh: ఇంత అవమానించారా..ఇంకో హీరో అయితే ఇండస్ట్రీనే వదిలేసేవాడు..!
Adivi Sesh: ఇంత అవమానించారా..ఇంకో హీరో అయితే ఇండస్ట్రీనే వదిలేసేవాడు..!

Adivi Sesh: శేష్ దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో అయ్యాడు.

అయితే, ఈ సినిమాలో ముందు నవదీప్ పాత్రకు అడవి శేష్‌ను తీసుకొని రెండు రోజులు షూటింగ్ కూడా చేసి తీసేశారట. దర్శకుడు అనుకున్నట్టుగా శేష్
చేయలేకపోయాడా..లేక మరేదైనా కారణమా తెలీదు గానీ, ఆ ప్లేస్‌లో నవదీప్ వచ్చి చేరాడు. ఇక అగ్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడు
ఆర్యన్ హీరోగా పరిచయమైన సినిమా సొంతం. ఇందులో శేష్ చేసింది పెద్ద పాత్ర అయినా కేవలం అయిదంటే అయిదే సెకన్లు ఉంచారట. ఇలాంటివన్నీ
శేష్ చాలా భరించానని చెప్పుకొచ్చాడు. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అవమానాలు ఎదురైతే ఎవరికైనా వీరక్తి కలిగి అసలు ఇండస్ట్రీ వద్దనుకుంటారు. కానీ,
శేష్ దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో అయ్యాడు.

- Advertisement -