Adivi Sesh: చందమామ సినిమాలో తానే హీరోనంటున్నా అడవి శేష్.. కానీ తీసేశారు అంటూ!

Akashavani

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి అందరికీ పరిచయమే. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రతి ఒక్క సినిమాలో హీరోగా తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

2010లో కర్మ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అడవి శేష్.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను నిలుపుకున్నాడు. ఇక 2018 లో విడుదలైన గూఢచారి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం ఈయన శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముంబై టెర్రర్ ఎటాక్ లో దేశం కోసం ప్రాణాలు విడిచిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం నేపథ్యంలో రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు జి ఎన్ వి ప్రొడక్షన్ లో నిర్మాతగా చేస్తున్నాడు.

Adivi Sesh: చందమామ సినిమాలో తానే హీరోనంటున్నా అడవి శేష్.. కానీ తీసేశారు అంటూ!
Adivi Sesh: చందమామ సినిమాలో తానే హీరోనంటున్నా అడవి శేష్.. కానీ తీసేశారు అంటూ!

Adivi Sesh: పెద్ద పాత్ర అని ఆ సినిమాలో 5 సెకన్లు మాత్రమే ఉంచారట..

ఈ సినిమా తర్వాత మరో మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆయన ప్రమోషన్స్ భాగంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నాడు. అంతే కాకుండా ఆయన చందమామ సినిమాలో ఒరిజినల్ హీరో తానే అని.. నవదీప్ స్థానంలో తనే ఉండాల్సింది అని అన్నాడు. రెండు రోజుల షూటింగ్ తర్వాత సినిమా క్యాన్సిల్ అయ్యిందని.. ఆ తరువాత ‘సొంతం’ లో పెద్ద రోల్ ఉందన్నారు అంటూ.. కట్ చేస్తే సినిమాలో 5 సెకండ్లు ఉన్నాను అంతే అని అన్నాడు.

- Advertisement -