Adivi Shesh : సన్నీలియోన్ వల్ల పేరు మార్చుకున్నానంటున్న అడవి శేష్.. ఏం జరిగిందంటే?

Akashavani

Adivi Shesh : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అడవి శేష్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన తొలిసారిగా కర్మ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను నిలుపుకున్నాడు. ఇక గూఢచారి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. నిజానికి ఈయన సినిమాలలో చాలా కొత్తదనం ఉంటుంది. కథ నాచురల్ గా ఉన్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ఇక ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా ముంబై టెర్రర్ ఎటాక్ లో దేశం కోసం ప్రాణాలు విడిచిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం నేపథ్యంలో రూపొందింది. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు జి ఎన్ వి ప్రొడక్షన్ లో నిర్మాతగా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆయన ప్రమోషన్స్ భాగంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నాడు.

Adivi Shesh : సన్నీలియోన్ వల్ల పేరు మార్చుకున్నానంటున్న అడవి శేష్.. ఏం జరిగిందంటే?
Adivi Shesh : సన్నీలియోన్ వల్ల పేరు మార్చుకున్నానంటున్న అడవి శేష్.. ఏం జరిగిందంటే?

Adivi Shesh : తన పేరు మారడానికి కారణం ఇదే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో తన పేరు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. తన అసలు పేరు అడవి సన్నీ కృష్ణ అని.. కానీ అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీ లియోన్ అనే ఆటపట్టిస్తూ ఉండడంతో వెంటనే తను అడవి శేష్ గా మారాను అని అన్నాడు. ఇక అప్పటి నుంచి తనను అలాగే పిలుస్తారు అని తెలిపాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వెలువడ్డాయి. మరి ఈ సినిమాతో అడవి శేష్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

- Advertisement -