Adivi Shesh: అడివి శేష్ ఎన్నో విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే ఈయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశాయి. ఇకపోతే అడివి శేష్ సినిమా వస్తుంది అంటేనే అభిమానులు కూడా ఈ సినిమాలపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈయన నటించిన మేజర్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా జూన్ 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది.
ముంబై దాడుల్లో భాగంగా దేశం కోసం చివరి క్షణం వరకు పోరాడుతూ అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో మేజర్ సందీప్ పాత్రలో అడవి శేష్ జీవించారని చెప్పాలి. ఈ సినిమాతో సందీప్ కు తాను పెద్ద అభిమానిగా మారిపోయానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఇక తాను అమెరికాలో పెరిగినప్పటికీ తెలుగులో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నానని తెలిపారు.

Adivi Shesh: లవ్ లో ఫెయిల్ అయిన శేష్…
మంచు లక్ష్మి లాగా తెలుగు మాట్లాడితే అందరూ ఎక్కడ తిడతారేమో అని కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఈ సందర్భంగా శేష్ వెల్లడించారు.తనకు అమెరికాలో ఉండటం కన్నా ఇండియాలోనే ఉండటం ఇష్టం అని అందుకే ఇక్కడ సినిమాలలో నటిస్తూ ఉన్నానని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే పెళ్లి వయసు వచ్చిన శేష్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఈయన మాట్లాడుతూ తన కన్నా ఎంతో పెద్దవాళ్ళు అయిన సల్మాన్ ఖాన్ వంటి హీరోలు చాలామంది ఉన్నారని వారు అందరు పెళ్లి చేసుకున్న తరువాతే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్ మాదిరి మీకు కూడా ఎఫైర్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా… తనకు ఎవరితోనూ ఎలాంటి ఎఫైర్స్ లేవని ఆయన తెలిపారు.అయితే అమెరికాలో ఉన్నప్పుడు తాను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి పెళ్లి తన పుట్టినరోజు జరిగిపోయిందని ఈయన తన లవ్ ఫెయిల్యూర్ గురించి తెలియజేస్తూ బాధపడ్డారు.