Ahimsa: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన అహింస సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది . సినిమా విడుదలైన మొదటి షో నుండి సినిమా గురించి నెగిటివ్ టాక్ వినిపించింది. సినిమా స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో పాటు అభిరామ్ నటన కూడా ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. ఇదిలా ఉండగా మొదటిసారిగా అభిరామ్ హీరోగా నటించిన అహింస సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.
అభిరామ్ శ్రీ రెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. గతంలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి అభిరామ్ తనని వాడుకున్నాడు అంటూ శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా బయట పెట్టింది. అప్పటినుండి శ్రీరెడ్డి కొందరు సినీ సెలబ్రిటీల మీద తరచూ విమర్శలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా అభిరామ్ గురించి దగ్గుబాటి కుటుంబ సభ్యుల గురించి తరచూ బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
Ahimsa: తేజాని సైతం వదలని శ్రీరెడ్డి…
ఇక తాజాగా మరొకసారి అహింస సినిమా ప్లాప్ అవడంతో శ్రీ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ హీరో అభిరామ్ తో పాటు దర్శకుడు తేజ మీద కూడా బూతులు తిడుతూ రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో ” మా అభి బావ హింస పెట్టి సావగొట్టాడంట కదా.. మొత్తానికి అభిగాడి పని అపోయింది, అయ్యో ఫాఫమ్ అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా “తేజ గా ఔట్ డేటెడ్ అయిపోయావు గానీ కొత్త డైరెక్టర్‌లా పోజు గొట్టకుండా ఇంటికెళ్లు ఇక అని రాసి పోస్ట్ షేర్ చేసింది. శ్రీ రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.