Aishwarya: అడవిలో అభిమన్యుడు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ‘సీతాకోక చిలుకలు’, ‘నరసింహం’ , ఆకాశమంత వంటి ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఐశ్వర్య భాస్కరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన ఐశ్వర్య ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో వ్యాపారం మీద దృష్టి పెట్టింది. ఈ సమయంలో సబ్బుల బిజినెస్ ప్రారంభించి జీవనం కొనసాగిస్తుంది. అంతేకాకుండా కుకింగ్ వీడియోస్ చేస్తూ, అలాగే ఆధ్యాత్మికత గురించి కూడా అమూల్యమైన విషయాలను యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఐశ్వర్య కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోలో ఐశ్వర్య భాస్కరన్ మాట్లాడుతూ..” వ్యాపారం కోసం తన పర్సనల్ నెంబర్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో కొంతమంది అదే అదునుగా తీసుకొని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని తన బాధ వెల్లడించింది.సోషల్ మీడియాలో తన నంబర్ షేర్ చేసిన దగ్గర నుంచి అనుచిత సందేశాలు, అసభ్యకర ఫొటోలు పంపిస్తున్నారని తెలిపింది. అంతే కాకుండా కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు కూడా షేర్ చేస్తున్నారని, దీంతో ఆమె మెంటల్‌గా డిస్టర్బ్ అయినట్లు చెప్పుకొచ్చింది.

Aishwarya: చట్టపరమైన చర్యలు తీసుకుంటా…
అయితే తాను ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని కోరుకోవడం లేదని, కానీ వేధింపులు ఇలాగే కొనసాగితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తనని వేదింపులకు గురి చేస్తున్న వారికి వీడియో ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో కొంతమంది నేటిజన్స్ ఐశ్వర్యకి మద్దతు పలుకుతూ ఆమెకు దైర్యం చెబుతున్నారు. దీంతో ఐశ్వర్య వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది.