Aishwarya Bhaskaran : ఐశ్వర్య భాస్కరన్… సీనియర్ హీరోయిన్ లక్ష్మి వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 1991 లో ఓలియంబుకల్ అనే మలయాళం సినిమా ద్వారా కెరీర్ ని ప్రారంభించారు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలసి మూడు సినిమాలు చేసారు ఐశ్వర్య. ఇక తెలుగులో కూడా అడవిలో అభిమన్యుడు సినిమా ద్వారా పరిచయం అయ్యి అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ బాగా సాగుతున్న సమయంలోనే 1994 లో తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం, పిల్లలు ఇలా సినిమాలకు దూరమైన ఐశ్వర్య 1996 లో తన భర్తతో విడాకుల అనంతరం తిరిగి సినిమాలలో నటించడం ప్రారంభించింది.
విడాకుల తర్వాత 1999 లో హౌస్ ఫుల్ అనే సినితో పార్థిబంతు తో కలసి చేసింది. తరువాత హీరోయిన్ అవకాశాలు రాకపోనా చిన్న చిన్న పాత్రాలలో నటించింది. తరువాత అవికూడా రాలేదు, తరువాత సీరియల్స్ లో కూడా నటించింది. అయితే అందులో కూడా కవాకాశాలు పెద్దగా రావట్లేదు. సినిమాలలో ఒకవెలుగు వెలిగిన చాలామంది ఆర్థిక ఇబ్బందులలో వున్నా సంగతి తెలిసిందే. ఇలాంటి జాబితాలోక్ వస్తారు ఐశ్వర్య. సినిమాలలో అవకాశలు లేక ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక ఇబ్బందుల గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Aishwarya Bhaskaran : ఇంటి ఇంటికి తిరుగుతూ సబ్బులు అమ్ముకుంటున్న……
ఒక అపుడు హీరోయిన్ గా మంచి సినిమాలు చేసిన ఐశ్వర్య ప్రస్తుతం పూట గడవని స్థితిలో వున్నారట. ఇంట్లో వున్న పిల్లులను కూడా పోషించలేని స్థితిలో వున్నానని, అందుకే ఇంటి ఇంటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటున్నాని చెప్పుకొచ్చారు. సినిమాలు తనకు తిండి పెట్టడం లేదని, సీరియల్స్ కారణంగానే తనకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం బుల్లితెరా మీద కూడా అవకాశాలు రావడం లేదని, సీరియల్ దర్శకులు కాస్త తన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అవకాశాలు ఇస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తాను మల్టీ మామ్స్ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్నాను అని దయచేసి దాన్ని అందరు సబ్స్క్రయిబ్ చేసుకొని తనకు సహాయపదాలని కోరుకున్నారు. ఆరోగ్య పరంగా నేను చాలా బాగున్నానని, ఆర్థికపరంగా మాత్రమే కష్టపడుతున్నాను అని ఎలాంటి జాబ్ అయిన తాను చేయడానికి సిద్ధంగా వున్నాను అని తెలియజేసారు.