Aishwarya -Danush: ఐశ్వర్య ధనుష్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి ఈ జంట ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సుమారు 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఐశ్వర్య ధనుష్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇకపోతే ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఊహించని విధంగా విడాకులు వచ్చాయి.18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడి పోతున్నామని ప్రకటించారు. ఇలా వీరి ప్రకటన విని ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.
ఇకపోతే వీరిద్దరిని కలపడం కోసం రజనీకాంత్,ధనుష్ తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వీరిద్దరూ విడాకుల బంధంతో భార్య భర్తలుగా విడిపోయిన స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటించారు.అయితే తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుష్ నటించిన త్రీ (3) సినిమా గురించి మనకు తెలిసిందే. నటి శృతి హాసన్ తో కలిసి ఈ సినిమాలో నటించారు.

Aishwarya -Danush: భర్తపై ప్రేమతో వాటిని భరించిన ఐశ్వర్య…
ఈ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్ నటి శృతి హాసన్ తో చాలా చనువుగా ఉండేవాడని, తనతో ఎఫైర్స్ కొనసాగిస్తూ ఈ సినిమాలో కూడా ఎంతో రొమాంటిక్ సన్నివేశాలలో నటించారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ ఐశ్వర్యకు తెలిసినప్పటికీ ఆమె కేవలం తన భర్త పై ఉన్న ప్రేమతో తన భర్త ఎఫైర్స్ గురించి ఎక్కడా బయట పెట్టలేదు. ఇలా తన భర్త ఎఫైర్స్ బయటపెట్టకుండా ఇన్ని రోజుల పాటు ఐశ్వర్య సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయాల గురించి వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు జరిగాయని అందుకే విడాకులు తీసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.