Aishwarya Rai: బాలీవుడ్ నటి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ పొందడమే కాకుండా నటి ఐశ్వర్య నటునకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అయితే ఐశ్వర్య నటనపై ఈ సినిమా గురించి నటుడు అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ… చిత్ర బృందం కృషి మొత్తం కళ్లకు కట్టినట్టు కనపడుతుంది.
ఇక ఐశ్వర్య నటన అద్భుతం తనను చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ తన నటనపై ప్రశంసలు కురిపించారు. ఇలా ఐశ్వర్య నటన గురించి ఈయన పొగుడుతూ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ట్వీట్ పై నేటిజన్స్ స్పందిస్తూ అందుకే మీరు ఇంట్లో ఉండి ఆరాధ్యను చూసుకుంటూ తనకు సినిమాలు చేసే అవకాశం ఇవ్వండి అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ పై స్పందించిన అభిషేక్ బచ్చన్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.
Aishwarya Rai: నా అనుమతి అవసరం లేదు…
ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ సమాధానం చెబుతూ… ఎవరు వద్దన్నారు? సార్ తాను చేసే పనులకు నా అనుమతి అవసరం లేదు ముఖ్యంగా తనకు ఇష్టమైన పనులు చేసేటప్పుడు నాకు చెప్పాల్సిన పని కూడా లేదు అంటూ అభిషేక్ రిప్లై ఇచ్చారు. ఇలా అభిషేక్ బచ్చన్ చెప్పినటువంటి సమాధానం పై స్పందించిన నేటిజన్ చాలా మంచి విషయం చెప్పారు సార్.మీరిద్దరు కూడా కలిసి నటిస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేశారు.ఇలా ఐశ్వర్య నటన గురించి అభిషేక్ బచ్చన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.