Aishwarya Rajinikanth: సాధారణంగా ప్రస్తుత కాలంలో వివాహ బంధాన్ని గౌరవించేవారు కనుమరుగవుతున్నారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా విడాకుల వరకు వెళ్తున్నారు. సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు పట్టుమని పది సంవత్సరాలకు కూడా కలసి కాపురం చేయకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జంటలు విడిపోయి మళ్ళీ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా విడిపోయిన సెలబ్రిటీలలో హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య కూడా ఉన్నారు.
ధనుష్ – ఐశ్వర్య 15 సంవత్సరాల పాటు వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్న వీరిద్దరూ గతయేడాది విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. ధనుష్ మరొక స్టార్ హీరోయిన్ తో రిలేషన్ లో ఉండటం వల్ల ఐశ్వర్య కి విడాకులు ఇచ్చాడని గతంలో ఒక వార్త వైరల్ అయింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఐశ్వర్య గురించి ఇలాంటి వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
Aishwarya Rajinikanth కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య వివాహం…
ధనుష్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఇంతకాలం ఒంటరిగా ఉన్న ఐశ్వర్య ప్రస్తుతం రెండవ పెళ్లికి సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ కోలీవుడ్ యంగ్ హీరోతో ఐశ్వర్య ప్రేమాయణం నడుపుతున్నట్లు సమాచారం . ఇటీవల చెన్నైలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో ఆ యంగ్ హీరోతో కలిసి ఐశ్వర్య కనిపించడంతో ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఐశ్వర్య మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి ? ఇవన్నీ కేవలం పుకార్లేనని రజనీ అభిమానులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. అయితే ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలంటే ఐశ్వర్య స్పందించాల్సి ఉంటుంది.