Aishwarya Rajinikanth: సాధారణంగా ఇంట్లో పనిచేసే వారు అప్పుడప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతూ విలువైన వస్తువులు దొంగలు ఇస్తూ ఉంటారు. చిన్న చిన్న వస్తువులు దొంగలించినప్పుడు కనిపెట్టలేక పోవచ్చు కానీ విలువైన వస్తువులు పోయినప్పుడు మాత్రం అందరికీ అనుమానం వస్తుంది. అలాగే ఇటీవల రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో 60 సవర్లు బంగారం కనిపించకపోవడంతో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా ఇంటి పనిమనిషి ఈశ్వరి ఆ బంగారం దొంగలించినట్లుగా నిర్ధారించారు.
ఆ తర్వాత పోలీసులు ఈశ్వరిని విచారించగా తానే దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించింది. అంతేకాకుండా తాను దొంగతనం చేయటానికి ఐశ్వర్య కారణమని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐశ్వర్య ఇంట్లో గోడ్డు చాకిరీ చేయించుకుని ఎంత డబ్బు ఉన్నా కూడా కేవలం తనకి 30000 మాత్రమే జీతం ఇచ్చేదని పోలీసుల విచారణలో ఈశ్వరి వెల్లడించింది. సామాన్య ప్రజలు బ్రతకటానికి 30 వేల జీతం ఏమాత్రం సరిపోదు. అందువల్ల ఆవిడ ఇంట్లో దొంగతనం చేయటం ప్రారంభించాను. మొదట చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేసే దానిని. అప్పుడు దొరికిపోలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి 60 సవర్ల బంగారం దొంగలించడంతో పట్టు పడ్డాను అంటూ ఈశ్వరి విచారణలో వెల్లడించింది.
Aishwarya Rajinikanth: దొంగతనం చేయడానికి తనే కారణం…
పోలీసులు ఈశ్వరి ఇంట్లో తనకి చేయగా ఐశ్వర్య ఇంట్లో దొంగలించిన బంగారం కంటే ఎక్కువ బంగారం అక్కడ లభ్యం అయింది. దీంతో పోలీసులు మరీ లోతుగా విచారణ చేపట్టారు. ఈశ్వరి ఐశ్వర్య ఇంట్లో మాత్రమే కాకుండా రజినీకాంత్, ధనుష్ ఇంట్లో కూడా పనిచేసేది. మిగిలిన బంగారు నగలు ఇతర విలువైన వస్తువులు వారి ఇళ్లల్లో దొంగలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దొంగతనం కేసులో ఈశ్వరికి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఐశ్వర్య పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.