Ajith: అజిత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయనకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఈయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. సినిమాలంటే ఇష్టం ఉన్నటువంటి అజిత్ సినిమాల తర్వాత బైక్ రైడింగ్ చాలా ఇష్టపడతారు. ఇలా బైక్ పై ఈయన వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అజిత్ గురించి నటుడు అబ్బాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అజిత్ గురించి అబ్బాస్ మాట్లాడుతూ అజిత్ ఎంతో మంచి వ్యక్తిత్వం కలవాడు తాను ఏ విషయం అయినా కూడా దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలవాడు. ఇలా ఎంతో నిజాయితీగా ఉండే అజిత్ కి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పినట్లు ఈ సందర్భంగా అబ్బాస్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.ఇలా అజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మా స్టార్ హీరో పక్షవాతానికి గురికావడమా అంటూ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.
Ajith: సర్జరీలే కారణం…
ఇలా ఈయన పక్షవాతానికి ఎందుకు గురికావాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు ఏంటి అనే విషయానికి వస్తే ఈయనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఇలా బైక్ రైడింగ్ చేస్తూ కొన్నిసార్లు ప్రమాదానికి కూడా గురయ్యారు. ఇలా బైక్ రైడింగ్ తో పాటు అజిత్ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్నోసార్లు ప్రమాదానికి గురికావడం వల్ల ఆయనకు చాలా సార్లు సర్జరీలు చేశారు. ఇలా ఎక్కువసార్లు సర్జరీ చేయడం వల్ల భవిష్యత్తులో ఈయన పక్షవాతానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్లు ఈ సందర్భంగా అబ్బాస్ అజిత్ గురించి తెలిపారు. అయితే ఈయన తన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమాలలో నటిస్తున్నారని అదే విధంగా బైక్ రైడ్ కూడా చేస్తూ ఉన్నారని అబ్బాస్ తెలిపారు.