Ajith Kumar: తమిళ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆగ్ర హీరో అజిత్ కుమార్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన అగ్ర హీరో అయినప్పటికీ ఒక కామన్ మ్యాన్ లా చాలా సింపుల్ గా ఉంటారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సాధారణమైన జీవితం జీవిస్తూ ఉంటారు.ఇలా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అజిత్ వ్యక్తిగతంగా కూడా ఒక మంచి వ్యక్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇకపోతే ఈ సంక్రాంతి కానుకగా అజిత్ తునివు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో తెగింపు అనే పేరుతో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టకు ముందే తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారు. దీంతో తన ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అజిత్ అందరి హీరోల మాదిరిగా కాకుండా తన ఫ్యామిలీని సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంచారు.
Ajith Kumar: ప్రొడక్షన్ రంగంలోకి అజిత్ కుమార్తె….
ఈ క్రమంలోనే వీరి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు పెద్దగా సోషల్ మీడియాలో కనిపించవు ఏదో ఇలా వెకేషన్ కి వెళ్లిన సమయంలోనే అజిత్ ఫ్యామిలీ ఫోటోలు బయటకు వస్తుంటాయి. ఇకపోతే తాజాగా అజిత్ కుమార్తె కుమారుడు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమార్తె అనుష్క కుమారుడు అద్విక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత వీరి ఫోటోలు చూడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలలో అజిత్ కుమార్తె అనుష్క స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ప్రస్తుతం అనుష్క విదేశాలలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈమె త్వరలోనే తన చదువులు పూర్తిచేసుకుని ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. ప్రస్తుతం అజిత్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.