Alekhya Reddy: నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 23 రోజులపాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా తారకరత్న మరణించడంతో తన భార్య అలేఖ్యరెడ్డి ఎంతో ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఇక ఈయన మరణించి నెల అవుతున్నప్పటికీ ఇంకా తన భర్త మరణ వార్త నుంచి అలేఖ్యరెడ్డి బయటపడలేదని తెలుస్తోంది. ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య కుటుంబానికి బాలయ్య ఎంతో భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య తన కుటుంబానికి కల్పించిన భరోసా గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే తాజాగా బాలయ్య తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఈమె సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తారకరత్న గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో బాలయ్య ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.ఎవరైతే కార్డియో, తోరియాక్ ట్రీట్మెంట్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి పేదవారికి ఫ్రీగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.తారకరత్న చివరి క్షణాల్లో అనుభవించిన ఇబ్బందులు మరెవరు భరించకూడదన్న ఉద్దేశంతో బాలకృష్ణ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు.
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్న హాస్పిటల్ తో పాటు హైదరాబాదులోని బసవతారకం హాస్పిటల్ లో కూడా ఈ మేరకు వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు.
Alekhya Reddy: బంగారు మనసు…
ఇక ఈ విషయంపై అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..మీ గురించి ఏమని చెప్పను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పను మీ గురించి ఎంత చెప్పినా మీరు చేసే గొప్ప పనులలో అది చాలా తక్కువ. మిమ్మల్ని బంగారు మనసున్న వ్యక్తి అనడంలో అతిశయోక్తి లేదు. ఆ పేరుతో పిలిపించుకోవడానికి మీరే సరైన అర్హులు. మీరు నాకు ఒక తండ్రి స్నేహితుడు కంటే ఎక్కువగా కనిపిస్తున్నారు.ఇప్పుడు మీరు నాకు ఓ భగవంతుడిలా కనిపిస్తున్నారు. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి గుండె లోతుల నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జై బాలయ్య అంటూ ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి బాలయ్య గురించి చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
View this post on Instagram