Alekhya Reddy: నందమూరి తారక రత్న మరణించి దాదాపు నెల కావస్తున్న ఇప్పటికే ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఇంకా తన భర్త మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు.ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఈమె మరోసారి తారకరత్నను తలుచుకుంటూ బాలయ్య గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోతో పాటు తారకరత్న ఫోటోని కూడా మార్ఫింగ్ చేసిన ఫోటో షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె బాలయ్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. మేము కుటుంబం అని చెప్పుకునే ఏకైక వ్యక్తి ఆయన… మేం కష్టాల్లో ఉన్నప్పుడు, మాకు రాయిలా కొండంత అండగా నిలిచిన వ్యక్తి బాలయ్య.నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు ఒక తండ్రిలా నీ వెంటే వచ్చారు ఒక అమ్మలా లాలి పాడారు… ఎవరు లేని సమయంలో తన సిల్లి జోక్స్ వేస్తూ నిన్ను నవ్వించే ప్రయత్నం చేశారు. ఆయన మాటలకు నువ్వు రియాక్ట్ అవుతారేమోనని… ఎవరు లేని క్షణంలో నీకోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. నీ చివరి క్షణం వరకు ఆయన నీ వెంటే ఉండి నీకోసం పోరాడారు.
Alekhya Reddy: చాలా మిస్ అవుతున్నాను…
ఓబు నువ్వు ఇంకా కొద్ది రోజులు ఉండి ఉంటే బాగుండేది నిన్ను చాలా మిస్ అవుతున్నాము అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు అలాగే ఈ ఫోటోని ఎడిటింగ్ చేసినది ఎవరో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేశారు. నిజంగానే రియల్ ఫోటోలా ఉంది అంటూ ఈమె ఈ ఫోటో ఎడిట్ చేసిన వారి గురించి కూడా చెప్పుకొచ్చారు.ఇలా అలేఖ్య రెడ్డి బాలకృష్ణ తన కుటుంబానికి అండగా ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఆమె తారకరత్నను మిస్ అవుతున్నటువంటి సంఘటనను కూడా తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
View this post on Instagram