Alekhya Reddy: నందమూరి తారకరత్న గత నెల 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణించి నేటికి నెల రోజులు కావడంతో సోషల్ మీడియా వేదికగా తన భార్య అలేఖ్యరెడ్డి తన భర్త మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి తారకరత్నతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లి నేటికి సరిగ్గా నెల రోజులు అయింది కానీ నీ జ్ఞాపకాలు మాత్రం మాలో అలాగే పదిలంగా ఉన్నాయని ఈమె తెలిపారు. నీతో నాకు ఏర్పడిన పరిచయం ఆ పరిచయం స్నేహంగా మారడం స్నేహం ప్రేమగా మారడం ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్లడం జరిగింది.
ఇలా మన పెళ్లి జరుగుతుందా లేదన్న బెరుకుగా నేను ఉన్నప్పటికీ నువ్వు మాత్రం ఆ క్షణాలను తీసుకొచ్చి నిజం చేశావు. ఇక మన పెళ్లి జరిగిన కూడా ఎన్నో కష్టాలు అవమానాలను భరించాం.అయినప్పటికీ నువ్వు నా పక్కన ఉండడంతో సంతోషించాను ఇక నిషికమ్మ పుట్టడంతో మన జీవితంలో ఆనందం రెట్టింపు అయింది కానీ కష్టాలు అలాగే ఉన్నాయి.అయినవాళ్లే మనపై చిమ్ముతున్న ద్వేషం నుంచి తప్పించుకోవడం కోసం కళ్ళకు గంతులు కట్టుకొని బ్రతికాము. పెళ్లి చేసుకుని ఇంటికి దూరమైతే మన కుటుంబం పెద్దదిగా ఉండాలని భావించావు 2019లో కవలలు పుట్టడంతో సంతోషించావు.
Alekhya Reddy: మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నా…
నువ్వు నీ చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉన్నావు అయినప్పటికీ నీ గుండెల్లో ఉండే బాధ ఎవరికి అర్థం కాలేదు.మనకు కావలసిన వాళ్లే మనకు పదేపదే గాయం చేస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయాను. మన ఈ ప్రయాణంలో మనకు సహాయం చేసిన వారిని కూడా కోల్పోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు. నిజంగా నువ్వు ఒక రియల్ హీరోవి.. నువ్వు మాకు స్ఫూర్తి నిన్ను చూస్తే గర్వంగా అనిపిస్తుంది మళ్ళీ కలుస్తానని ఆశిస్తున్నా అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్తను తలుచుకొని చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.