Aliya Bhatt: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన నటి ఆలియా భట్ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రముఖ నిర్మాత మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇంతకాలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఆలియా ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఆలియా ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన కూతురి కోసం సమయం కేటాయిస్తోంది.
ఆలియా భట్, రణబీర్ కపూర్ చాలాకాలంగా డేటింగ్ చేసి ఇటీవల పెళ్ళి చేసున్న సంగతీ అందరికీ తెలిసిందే. ఇక వీరి వివాహం జరిగిన కొంతకాలానికి తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ శుభవార్త తెలియజేశారు. గతేడాది నవంబర్ నెలలో ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం పనిచేసిన ఆలియా బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆలియా తన అందమైన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Aliya Bhatt: మెహందీ ఫంక్షన్ బోర్ అనిపించింది…
ఈ క్రమంలో ఇటీవల తన పెళ్లి వేడుకల గురించి ఆలియా ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 2022 ఏప్రిల్ 14వ తేదీన అంగరంగ వైభవంగా ఆలియా, రణబీర్ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఒక సందర్భంలో మాత్రం ఆలియా కు చాలా బోర్ అనిపించింది. తాజాగా ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ.. మెహందీ ఫంక్షన్ లో అంత సమయం అలా కూర్చోవటం తనకు నచ్చలేదని.. ఆ సమయంలో చిన్నపాప ఒకే దగ్గర కూర్చోవడం తనకు బోర్ కొట్టిందని చెప్పుకొచ్చింది.