Allari Naresh Daughter: కామెడీ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన అల్లరి నరేష్ ప్రస్తుతం తన స్టైల్ మార్చుకొని తన పేరులో తప్ప నటనలో అల్లరి ఉండదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లరి, కితకితలు వంటి ఎన్నో సినిమాలలో నటించి కామెడీ హీరోగా పేరు పొందిన అల్లరి నరేష్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం నరేష్ కామెడీ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ తన సత్తా నిరూపించుకుంటున్నారు
మహర్షి సినిమాలో మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో నటించి ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత నాంది సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న నరేశ్ ఇటీవల విడుదలైన మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో మరొక హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటు మంచి ఫామ్ లో ఉన్న నరేష్ ప్రస్తుతం ఉగ్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా మే 5 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు ప్రారంభించారు.
Allari Naresh Daughter: క్యూట్ గా ఉన్న నరేష్ కూతురు…
విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నరేష్ కూతురు కూడా నటించింది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఉగ్రం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా ట్రైలర్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో నరేష్ కూతురు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఈవెంట్లో నరేష్ కూతురు మాట్లాడుతూ తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంది.తాను ఈ సినిమాలో నటించానని, సినిమా చాలా బాగుంది అందరూ చూడండి అంటూ క్యూట్ మాటలతో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఒక పాట కూడా పాడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.