Allu Aravind: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి అంటే ఎంత అభిమానమో మనకు తెలిసిందే. గత కొంతకాలంగా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు వీరందరూ ఖండిస్తూ వచ్చారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా తాను చిరంజీవి గారికి ఎంత అభిమానిని అనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సక్సెస్ గురించి ఆయనకు మనం చెప్పాల్సిన పనిలేదని ఆయన చూడని సక్సెస్ ఏది లేదంటూ అల్లు అరవింద్ తెలిపారు.
Allu Aravind: జీవిత రాజశేఖర్ గురించేనా…
మీరంతా చిరంజీవి సినిమాలను చూస్తూ ఆయనకు అభిమానులుగా మారితే నేను మాత్రం చిరంజీవితో సినిమాలు చేస్తూ అభిమానిగా మారిపోయానని తెలిపారు. ఆయనపై నాకు ఎలాంటి అభిమానం ఉంది అనే విషయాన్ని మీకు వివరిస్తాను అంటూ చిరంజీవి చేసిన సేవలు గురించి కొందరు విమర్శలు చేయడంతో వారిని జైలుకు పంపించడానికి 12 సంవత్సరాలు పాటు పోరాటం చేశానని అది చిరంజీవిపై తనకు ఉన్నటువంటి అభిమానం అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలిపారు అయితే అల్లు అరవింద్ ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ దంపతులను ఉద్దేశించి ఈ కామెంట్ చేశారని అర్థమవుతుంది.