Allu Aravind: మెగా కోడలు లావణ్య త్రిపాటి గురించి అల్లు అరవింద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన లావణ్య వరుణ్ తేజ్ ని ప్రేమించి ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తొందర్లోనే ఈ అమ్మడు మెగా ఇంటికి కోడలిగా అడుగుపెట్టబోతోంది. ఇదిలా ఉండగా గతంలో అల్లు అరవింద్ అన్న మాటలు లావణ్య నిజం చేసిందంటూ ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. గతంలో చావు కబురు చల్లగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరైన అల్లు అరవింద్ … లావణ్య త్రిపాఠి ని ఉద్దేశిస్తూ… ఎక్కడో నార్త్ లో పుట్టి తెలుగు నేర్చుకొని చక్కగా మాట్లాడేస్తున్నావ్, ఇక్కడే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, అన్నాడు.
అల్లు అరవింద్ ఆ మాట చెప్పిన రెండేళ్లకే లావణ్య వరుణ్ తేజ్ ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఇదిలా ఉండగా బేబీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బేబీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే విషయం గురించి ప్రస్తావించగా అల్లు అరవింద్ స్పందిస్తూ… లావణ్య మంచి అమ్మాయి. తనంటే నాకు ఇష్టం. నా బ్యానర్ లో మూడు సినిమాలు చేసింది. ఆ చనువుతో ఇక్కడే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని సరదాగా అన్నాను అని చెప్పుకొచ్చాడు.
Allu Aravind: సరదాగా అంటే మావాడినే చూసుకుంది…
కానీ ఆ మాటలను లావణ్య సీరియస్ గా తీసుకుని మావాడినే ప్రేమించింది అంటూ అల్లు అరవింద్ సరదాగా తన మాటలు గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి పై వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం న్యూయార్క్ లో జరగనున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లావణ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల పులిమేక అనే వెబ్ సిరీస్ లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న లావణ్య మరొక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు ఇటీవల వెల్లడించింది.