Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సౌత్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ గురించి నటి ఆరోపణలు చేశారు.గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం వరుడు.
సరికొత్త కాన్సెప్ట్ తో ఐదు రోజుల పెళ్లి అంటూ హీరోయిన్ ని చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ గుణశేఖర్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ ఈ సినిమా తర్వాత చాలామంది ఐదు రోజుల పాటు పెళ్లి చేసుకోవడానికి ఇష్టత చూపుతున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించారు నటి భాను శ్రీ మెహ్రా. ఈ సినిమా ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా తదుపరి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈమె అల్లు అర్జున్ తనని ట్విటర్లో బ్లాక్ చేశారంటూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Allu Arjun: అన్ బ్లాక్ చేసిన బన్నీ…
అయితే ఈమె ఈ స్క్రీన్ షాట్ షేర్ చేసిన రెండు గంటలకు తిరిగి మరొక స్క్రీన్ షాట్ షేర్ చేశారు. గ్రేట్ న్యూస్ బన్నీ నన్ను అన్ బ్లాక్ చేశారు. నేను ఆయన గురించి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేదు అంటూ ఈమె తెలియజేశారు. ఇలా అల్లు అర్జున్ తనని తిరిగి అన్ బ్లాక్ చేయడంతో ఈమె సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈమె షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు అల్లు అర్జున్ నటి భాను శ్రీని ఎందుకు బ్లాక్ చేశారు తిరిగి ఎందుకు అన్ బ్లాక్ చేశారనే విషయం గురించి చర్చలు జరుపుతున్నారు.ఇక ప్రస్తుతం ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ మాత్రం పుష్ప2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.