Allu Arjun: ఆ హీరోకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. అది ఏంటో తెలుసా?

Akashavani

Allu Arjun: సినీ లవర్స్ కు యాక్టర్ నవదీప్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జై సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హీరో ఆ తర్వాత గౌతమ్ ఎస్ ఎస్ సి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆపై చందమామ సినిమాలో నటించి నటనలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత నవదీప్ పూర్తిగా హీరో పాత్రలకు దూరమై.. నటుడుగా హీరో ఫ్రెండ్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన అల్లు అర్జున్ ఆర్య 2 సినిమా లో బన్నీ ఫ్రెండ్ గా తన అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక నవదీప్, అల్లు అర్జున్ లు రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ అని మనకు తెలుసు.

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థాయితో సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ వ్యాల్యూ ఇచ్చే స్టార్ లు ఎందరో ఉన్నారు. వాళ్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నవదీప్ లు కూడా ఒకరు. ఇదిలా ఉంటే తాజాగా నవదీప్ కు అల్లు అర్జున్ ఒక గిఫ్ట్ పంపించాడు. ఖరీదైన గిప్ట్ ని రిసీవ్ చేసుకున్న నవదీప్ ఆ సంతోషాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.

Allu Arjun: ఆ హీరోకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. అది ఏంటో తెలుసా?
Allu Arjun: ఆ హీరోకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. అది ఏంటో తెలుసా?

Allu Arjun: నవదీప్ అల్లు అర్జున్ గిఫ్ట్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు!

అల్లు అర్జున్ నవదీప్ కు చాలా ఇష్టమైన ఎయిర్ పొడ్స్ గిఫ్ట్ గా పంపించాడు. దీంతో నవదీప్ సోషల్ మీడియాలో ఒక నోట్ ద్వారా ఈ విధంగా పంచుకున్నాడు. ప్రేమకు హద్దులు లేకుంటే ఒకేషన్ ఏమీ లేకుండా.. సందర్భానుసారంగా బహుమతులు లు వచ్చాయి థ్యాంక్స్ అర్జున్ బావ్స్ అని సమాజం ఒప్పుకో పోయిన ఈ ఆండ్రాయిడ్ ఎయిర్ పొడ్స్ వాడతా అని నవదీప్ క్యాప్షన్ రూపంలో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం నవదీప్ షేర్ చేసిన ఆ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ నోట్ చదివిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -