Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందినటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ ఒకరు.పుష్ప సినిమా ద్వారా పాన్ స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ త్వరలోనే తన మామయ్య చంద్రశేఖర్ రెడ్డి తరఫున ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో భాగంగా తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి తన అల్లుడు అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన గ్రామ సమీపంలోనే కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఈ ఫంక్షన్ హాల్ నిర్మించారని తెలుస్తుంది.ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఈ ఫంక్షన్ హాల్ ఏకంగా 1000 మందికి సరిపడేలా ఉండబోతుంది అని తెలుస్తుంది.
Allu Arjun: మామయ్య గెలుపే ధ్యేయం..
ఇక ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 1000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ భారీ స్థాయిలో భోజనాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరైతే ఈ కార్యక్రమం మరింత విజయవంతం అవుతుందని తనరాజకీయాలకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ చరిత్ర మీద గాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.