Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంతకాలం టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. పుష్ప సినిమాలో లాగే పుష్ప 2 లో కూడా ఒక అద్భుతమైన ఐటమ్ సాంగ్ ఉండబోతుందని ఆ పాట కోసం బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటెలని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. సాధారణంగా కొందరు సెలబ్రిటీలు జాతకాల పట్ల ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ఈ క్రమంలో జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాల నివారణ కోసం పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ మేరకు అల్లు అర్జున్ కూడా ఇలాంటి పూజలు చేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ జాతకంలో పెద్ద దోషం ఉందని .. పరిహార పూజలు చేయకపోతే ఆయన సినిమాల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫ్యామిలీ పూజారి చెప్పుకొచ్చారట .
Allu Arjun: ప్రత్యేక పూజలు చేసిన బన్నీ ఫ్యామిలీ…
అందువల్ల కొడుకు కెరీర్ బాగుండాలని అల్లు అర్జున్ తల్లి రాత్రికి రాత్రి బన్నీ జాతకంలో దోషాలు పోవడానికి పరిహార పూజలు చేయించడానికి రెడీ చేసిందట. అల్లు ఫామ్ హౌస్ లో బన్నీ – స్నేహ రెడ్డి – అల్లు అర్హ – అల్లు అయాన్ నలుగురు ఈ పూజలో పాల్గొన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అల్లు అర్జున్ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే మాత్రం ఆ దోషాలు తొలగిపోయి ఇలాగే కొనసాగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.