Allu Arjun: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా గంగోత్రి సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ షూటింగ్ పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.

వీలు దొరికినప్పుడల్లా భార్య పిల్లలతో కలిసి విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ అయిపోయిందంటే చాలు భార్య పిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా తన పిల్లలు అయాన్, అర్హ అంటే అల్లు అర్జున్ కి వల్లమాలిన ప్రేమ. తన కూతురి అర్హతతో కలిసి అల్లు అర్జున్ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అయాన్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కొడుకుకి స్పెషల్ విషెస్ తెలియజేశాడు.

Allu Arjun:  కొడుకు పై ప్రేమను బయటపెట్టిన అల్లు అర్జున్…

రీసెంట్‌గా అయాన్ తో దిగిన ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌ డే టు లవ్ ఆఫ్ మై లైఫ్ ..మై స్వీటెస్ట్ చినబాబు అంటూ స్పెషల్ విషెస్ చెప్పాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అయాన్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా అయాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అయాన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on ఏప్రిల్ 3, 2023 at 7:00 సా.