Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఫాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడిగా కూడా అవార్డు అందుకున్నారు. ఇలా నేషనల్ యాక్టర్ గా అవార్డు అందుకోవడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ కి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్లో మొదట ఆర్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలుసు ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సుకుమార్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయారట.ఈ సినిమాలో హీరోయిన్ కాళ్ల పట్టి నీళ్లలోకి పడిపోతే హీరో దూకి దానిని వెతికి తీసుకువస్తారు అయితే ఈ సన్నివేశం చూపించే సమయంలో సుకుమార్ పొరపాటున నీళ్లలో జారిపడ్డారట అయితే అందరూ చూస్తూనే ఉన్నప్పటికీ ఆయనని కాపాడే ప్రయత్నం మాత్రం ఎవరు చేయలేదు. అందరూ కూడా సుకుమార్ కి ఈత వస్తుంది తాను క్షేమంగా బయటకు వస్తారని భావించారు కానీ సుకుమార్ పరిస్థితి చూసి అల్లు అర్జున్ తనని సేవ్ చేశారని తెలుస్తోంది.
Allu Arjun: సరదాగా అంటే సీరియస్ గా తీసుకున్న సుకుమార్..
ఇలా సుకుమార్ ని కాపాడిన తర్వాత తనకు ఈత రాదు అనే విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారట. అయితే మీరు వెంటనే స్విమ్మింగ్ నేర్చుకోమని అప్పుడే అల్లు అర్జున్ తనకు సలహా ఇచ్చారట. ఇలా తనని ప్రాణాలతో కాపాడినందుకు సుకుమార్ అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపగా అల్లు అర్జున్ మాత్రం తనకు కృతజ్ఞతలు అవసరం లేదు కానీ ఒక మూడు హిట్ సినిమాలు మాత్రం నాకు ఇవ్వు అంటూ అప్పట్లో సరదాగా అన్నారట. ఇలా ఆరోజు సరదాగా ఆయన అన్నప్పటికీ సుకుమార్ సీరియస్ గా తీసుకొని అల్లు అర్జున్ కి మాత్రం జీవితంలో మర్చిపోలేనటువంటి హిట్ సినిమాని అందించి మాట నిలబెట్టుకున్నారని తెలుస్తుంది.