Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ పంపిస్తూ అందరిని సర్ప్రైజ్ చేశారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లైన 11 సంవత్సరాలకు బిడ్డకు జన్మనిచ్చారు ఇలా ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మెగా వారసురాలు ఇంట్లో అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ చిన్నారికి క్లీన్ కారా అనే నామకరణం కూడా చేశారు అయితే ఇప్పటివరకు మెగా వారసురాలిని మాత్రం ఎవరికీ చూపించలేదు.
మెగా వారసురాలు ఎవరి పోలికలతో ఉన్నారు అన్న ఆత్రుత అందరిలోనూ ఏర్పడింది. ఈ విధంగా మెగా వారసురాలు జన్మించగానే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఆమె కోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకువస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తనకోసం గోల్డ్ గిఫ్ట్స్ పంపించగా మరికొందరు టాయ్స్ యాక్సెసరీస్ అన్ని పంపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు .ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం తన కోడలికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది అల్లు అర్జున్ ఇచ్చిన ఈ గిఫ్ట్ చూసిన మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారట. మరి అల్లు అర్జున్ కోడలి కోసం ఏం తీసుకువచ్చారు అనే విషయానికి వస్తే…
Allu Arjun: బన్నీ గిఫ్ట్ చూసి సంతోషంలో మెగా ఫ్యామిలీ..
క్లీన్ కారా ఏ నెల ఎన్నో తేదీ ఎన్ని గంటల సెకండ్లకు జన్మించింది అనే విషయాలన్నింటినీ కూడా బంగారు అక్షరాలతో రాయించి ఒక ప్రేమ్ తయారు చేయించారట. ఇలా తన పుట్టిన వివరాలన్నింటినీ కూడా బంగారు అక్షరాలతో తయారు చేయించి తనకు గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది ఇలా అల్లు అర్జున్ చాలా విభిన్నంగా ఆలోచించి తనకోసం పంపిన గిఫ్ట్ చూసిన ఉపాసన రాంచరణ్ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఉపాసన రాంచరణ్ క్లీన్ కారా హ్యాండ్ ప్రింట్ కూడా పంపినట్టు తెలుస్తుంది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతైనా అల్లు ఇంటికి కాబోయే కోడలు కదా ఆ మాత్రం ప్రేమ కురిపించకపోతే ఎలా అంటూ ఈ చిన్నారిని అల్లు అర్జున్ కి కోడల్ని చేస్తూ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.