Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈయన నేషనల్ అవార్డు అందుకోవడంతో ఎంతో మంది అభిమానులు అల్లు అర్జున్ రేర్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేతి పై ఒక టాటూ ఉండడం గమనించినటువంటి నేటిజన్స్ ఆటాటూ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడం కోసం ఆరాట పడుతున్నారు. అయితే అల్లు అర్జున్ చేతి మీద ఉన్నటువంటి టాటూ సీక్రెట్ ఇదివరకే ఆయన పలు సందర్భాలలో బయటపెట్టారు. ఈయన తన భార్య స్నేహ రెడ్డి పేరును టాటూ గా వేయించుకున్నారని తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ ఈ టాటూ గురించి మాట్లాడుతూ అది తన భార్య స్నేహ రెడ్డి పేరని రివిల్ చేశారు.
Allu Arjun:
ఇక స్నేహ రెడ్డి సైతం చేతి వేళ్ల దగ్గర తన భర్త అల్లు అర్జున్ పేరును టాటూగా వేయించుకున్నారు.ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం.ఇప్పటికే అల్లు అర్జున్ కుమార్తె అర్హ సినిమాలలోకి బాలనటిగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదలైంది. అదేవిధంగా గ్లింప్ వీడియో విడుదల కావడంతో ఈ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.