Allu Arjun: సాధారణంగా ఫిల్మ్ లో ఇండస్ట్రీ అన్నాక స్టార్ హీరోలు కలిసిమెలిసి ఉంటారు. కానీ తమరు అభిమానుల మధ్య మాత్రం రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ.. ఫ్యాన్స్ మధ్య ఇగో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.
ఇక ఇదే క్రమంలో ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమా నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య జరిగిన ఏర్పడిన ఘర్షణ మనకు తెలిసిందే. ఇక తాజాగా అదే క్రమంలో మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య ఊహించని స్థాయిలో ఘర్షణ జరుగుతుంది. కాగా ఈ గొడవల గురించి సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మిగతా హీరోల అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన సొంత టాలెంట్ తో నే ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడని మిగతా హీరోల అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ లో జరిగే ఈ ఫ్యాన్స్ వార్ లు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచూ జరుగుతున్నాయి.

Allu Arjun:అల్లు అర్జున్ అభిమానులు ఈ విధంగా నెగిటివ్ కామెంట్ చేశారు!
మొత్తానికి ఈ గొడవలకు సంబంధించిన నెగిటివ్ టాగ్ లు మాత్రం సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కెర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఏం పీకలేరు బ్రదర్ అనే ట్యాగ్ గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తోంది. గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా.. చెప్పను బ్రదర్ అనే మాటను ఏ విధంగా హడావుడి చేశాడో మనందరం గమనించాం.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు సంబంధించిన నెగిటివ్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంలో అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ టాగ్ వైపు రెండు కళ్లు వెయ్యండి