Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య కోసం ఊహించని గిఫ్ట్ పంపించారని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ వైష్ణవి చైతన్య కోసం ఏం పంపించారు అనే విషయానికి వస్తే…
యూట్యూబర్ గా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమెకు బేబీ సినిమాలో హీరోయిన్గా అవకాశం కల్పించారు. ఇలా ఈ సినిమాలో హీరోయిన్గా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వైష్ణవి చైతన్యకు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె సిద్దు జొన్నలగడ్డతో పాటు మరోసారి ఆనంద దేవరకొండతో కలిసి సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తనకోసం 20 లక్షల రూపాయల విలువ చేసే పంపించారని తెలుస్తుంది.
అడగకనే అవకాశం ఇచ్చిన బన్నీ…
ఇలా బేబీ హీరోయిన్ కోసం అల్లు అర్జున్ 20 లక్షల రూపాయల చెక్ పంపించడంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. అసలు తనకు ఎందుకు అల్లు అర్జున్ గారు 20 లక్షల రూపాయలు చెక్ పంపించారు అనే విషయానికి వస్తే .. ఆమెతో బన్నీ మాట్లాడుతూ త్వరలోనే మీరు గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారని అందుకే ముందుగా అడ్వాన్స్ పంపించానని చెప్పారట ఇలా అల్లు అర్జున్ నుంచి ఇలాంటి సర్ప్రైజ్ రావడంతో వైష్ణవి చైతన్య ఎగిరి గంతు వేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వైష్ణవి చైతన్య ప్రస్తుత ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.