Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ నేటికీ సరిగ్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. దీంతో ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఇరవై సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 20 సంవత్సరాలు పూర్తి అయిందని తెలియజేశారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఇన్నేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నాను అంటే అది కేవలం అభిమానులు తనపై చూపించిన ప్రేమ ఆదరణ అంటూ ఈయన వెల్లడించారు.
ఇలా మీ అందరి సపోర్ట్ ఆదరణ కారణంగా తను ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్నానని మీరు చూపించిన ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఇలాంటి పోస్ట్ చేయడంతో అభిమానులు ఈ పోస్టుపై స్పందిస్తూ ఈయన సినీ కెరియర్ కు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అందించిన సపోర్టు గురించి ఏమాత్రం మాట్లాడకుండా ఇదంతా ప్రేక్షకులు అభిమానుల వల్లే సాధ్యమైంది అంటూ ఈయన తెలియజేయడంతో అభిమానులు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Allu Arjun: విషెస్ చెప్పే సమయం లేదా…
ఇక అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ పై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 20 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి అయింది అంటూ ట్వీట్ చేసే సమయం ఉంది కానీ, రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పే అంత సమయం కూడా లేకుండా పోయిందా నీకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.మార్చ్ 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అయితే బన్నీ మాత్రం తనకు విషెస్ చెప్పకపోవడం చిరంజీవి ఇచ్చిన పార్టీకి కూడా అల్లు అర్జున్ హాజరు కాకపోవడంతో మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అలాగే ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయని అందుకే ఇలా బన్నీ దూరంగా ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.