Allu Arjun: డాడీ సినిమాలో అతి చిన్న పాత్రతో మన ముందుకి వచ్చిన అల్లు అర్జున్ 2003 లో గంగోత్రి సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందాడు అల్లు అర్జున్. బన్నీ అని ముద్దుగా పిలుచుకునే మన అల్లు అర్జున్ మొదటి సినిమాకి 3,500 పారితోషకం తీసుకున్నాడు.
ఇప్పుడు అదే బన్నీ పుష్ప 2 సినిమాకి 100 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. సౌత్ ఇండియాలోనే ఎక్కువ డిమాండ్ ఉన్న నటులలో అల్లు అర్జున్ ఒకడు. మొన్ననే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మన అల్లు అర్జున్ ఏప్రిల్ 8 న తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఈ 20 సంవత్సరాలలో భారీగా అభిమానులని సొంతం చేసుకోవటమే కాకుండా అదే రేంజ్ లో ఆస్తులు కూడా కూడబెట్టాడు అల్లు అర్జున్. మన సినీస్టార్స్ లో చాలా తక్కువ మందికి ప్రైవేట్ జెట్లు ఉన్నాయి అందులో అల్లు అర్జున్ ఒకరు. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్ ఎక్కువగా ప్రైవేట్ జెట్ లోనే వెకేషన్స్ కి వెళ్తుంటారు.
అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ ఖరీదే ఏడు కోట్లు. ఇందులో టీవీ ఫ్రిడ్జ్ తో పాటు పలు విలాసవంతమైన ఫీచర్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధతో తన అభిరుచికి తగినట్లుగా డిజైన్ చేయించుకున్నారు. ఒక్కొక్క సినిమాకి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే మన బన్నీ పుష్ప హిట్ అవడంతో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ 100 కోట్ల వరకు చేరింది.
Allu Arjun:
సినిమాలతో పాటు ఆయనకి పలు వ్యాపారాలలో షేర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఆయన ఆస్తి 400 కోట్ల నుంచి 500 కోట్లకు పైమాటే. అల్లు అర్జున్ ఇప్పటికీ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు అయినా ఆయనకి హైదరాబాదులోనే 100 కోట్ల విలువైన బంగ్లా ఉంది. ఇక బన్నీ కార్ల కలెక్షన్ విషయానికి వస్తే ఆయన దగ్గర హమ్మర్ హెచ్ టు, రేంజ్ రోవన్ వోగ్, జాగ్వార్ ఎక్స్ జె ఎల్, బీఎం డబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయి.