Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ ఒకరు. నటుడిగా ప్రతి సినిమా సినిమాకు తనని తాను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇలా ఈ సినిమా ద్వారా ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక నటుడిగా ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అల్లు అర్జున్ వరించింది. ఈ విధంగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ చాలామంది ముద్దుగా బన్నీ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఈయన గురించి ఎవరైనా మాట్లాడే సమయంలో బన్నీ అని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి అల్లు అర్జున్ కు బన్నీ అనే పేరు రావడం వెనుక ఓ పెద్ద స్టోరీ ఉందని తెలుస్తుంది. అయితే చాలామంది ఈయనని బన్నీ అని పిలవడానికి కారణం తను బన్నీ అనే సినిమాలో నటించడం వల్లే తనకు ఈ పేరు వచ్చిందని భావిస్తూ ఉంటారు. అయితే అల్లు అర్జున్ ని చిన్నప్పటినుంచి కూడా బన్నీ అని ముద్దుగా పిలుచుకునే వారట.
Allu Arjun: బన్నీ అని పిలవడానికి కారణం ఇదేనా…
మరి అల్లు అర్జున్ కు బన్నీ అనే పేరు ఎందుకు పెట్టారు ఏంటి అనే విషయానికి వస్తే.. బన్నీ అంటే కుందేలు పిల్ల అని అర్థం వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు అల్లు అర్జున్ ముందర రెండు పళ్ళు కూడా అచ్చం కుందేలుకు ఉన్న విధంగానే ఉండేవట. తన పళ్ళు అలా ఉండడంతో తన కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ని ముద్దుగా బన్నీ అంటూ పిలవడం మొదలుపెట్టారు. అయితే ఆ పేరు అలాగే కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈయన హీరోగా మారి బన్నీ అనే సినిమాలో నటించడం వల్ల అల్లు అర్జున్ కు బన్నీ అనే పేరు ముద్దు పేరుగానే ఉండిపోయింది.