Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న పుష్ప 2 సినిమా నుంచి వరుస అప్డేట్స్ రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన అల్లుడు అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోని ఈయన ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ… హ్యాపీ బర్త్ డే మై డియర్ బన్నీ.. పుష్ప 2 ది రూల్ ఫస్ట్ లుక్ రాకింగ్ గా ఉంది ఆల్ ది బెస్ట్ అంటూ మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా తనకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా పుష్ప 2 ఫస్ట్ లుక్ పోస్టర్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Allu Arjun: ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్…
ఇక సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా సర్వే గంగా షూటింగ్ పనులను జరుపుకొని ఈ ఏడాది చివరన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ద్వారా బన్నీ ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.
Happy Birthday Dear Bunny @alluarjun !
Many Happy Returns!! 💐💐Also The First Look of #Pushpa2TheRule Rocks!
All The Very Best!!— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2023