Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు కూడా ఈ అవార్డు అందుకోలేదు అయితే మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్నటువంటి నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడం విశేషం.ఈ విధంగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే మెగా కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి.
చిరంజీవి అయితే ఏకంగా అల్లు అర్జున్ తన ఇంటికి వెలిపించుకొని ఆయన చేత కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. చిరంజీవికి మోకాలి సర్జరీ జరిగిన నేపథ్యంలో ఈయన బయటకు కదలలేని పరిస్థితులలో ఉన్నారు అందుకే అల్లు అర్జున్ ని తన ఇంటికి పిలిపించుకొని అక్కడ సెలబ్రేషన్స్ చేశారు.ఇక అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ సైతం ఆయనకు ఫ్లవర్ బొకే పంపించడమే కాకుండా ఒక ఖరీదైన కానుక కూడా ఇచ్చారని తెలుస్తుంది.
Allu Arjun:
అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు ఫ్లవర్ బొకేతో పాటు హ్యాండ్ వర్క్ తో చేయించిన ఒక ఆర్ట్ అల్లు అర్జున్ రూపంలో వచ్చేలాగా డిజైన్ చేయించి మరి అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా పంపించారని తెలుస్తుంది.ఇలా అల్లు అర్జున్ ఇలాంటి ఒక గొప్ప అవార్డు సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక పుష్ప సినిమాకు గాను ఈ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.