Allu Arjun – Prabhas: ప్రముఖ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా బాహుబలి తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో స్థాయిలో తెరకెక్కుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
దీంతో పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు, అల్లుఅర్జున్ అభిమానుల మధ్య వార్ మొదలైంది. ఈ క్రమంలో నే మా హీరో పాన్ ఇండియా స్టార్ అంటే మా హీరో పాన్ ఇండియా స్టార్ అని అల్లు అర్జున్ ప్రభాస్ అభిమానుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.
ఇక అప్పట్లో ఇండియా టుడే కవరేజ్ గురించి కూడా ఈ రెండు హీరో ల అభిమానుల మధ్య పెద్ద వార్ ఏ జరిగింది. అది కొన్ని రోజుల తర్వాత సద్దుమణిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రోల్స్ ద్వారా మొదలైంది. మా హీరో నే ట్రోల్ చేస్తారా అంటూ మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యింది.
అయితే ఆ వార్ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వెళ్ళ పోస్ట్ ల వార్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో లో ఓ అభిమాని ఓ సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Allu Arjun – Prabhas: వార్ వద్దు కలిసి ఉందాం అంటూ ప్రభాస్ అభిమానులు..
ఆ ట్వీట్ అందరికీ ఆకట్టుకుంటుంది. అయితే ఆ ట్వీట్ లో ప్రభాస్ అభిమాని ఒకరు.. అరేయ్..ఇన్నాళ్లు సైలెంట్ ఉంది రా..ఇప్పుడు మళ్లీ PB-AA ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయ్యాయి..
ట్రోల్స్ ఎందుకు బ్రో.. అందరూ కలిసి ఉందాం.. మన హీరోలలాగా.. అంటూ అల్లు అర్జున్, ప్రభాస్ కలిసి ఉన్న ఫొటోస్ షేర్ చేశాడు. దీన్ని చూసిన మరి కొందరు అభిమానులు.. వార్ మీరే కదా స్టార్ట్ చేసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత వరకు ఏ రోజు దీని పై ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ స్పందించలేదు. ఇప్పుడైనా స్పందిస్తారో లేదో చూడాలి.