Allu Arjun: అల్లుఅర్జున్ వల్ల సస్పెండ్ అయిన స్కూల్ ప్రిన్సిపాల్.. ఏం జరిగిందంటే?

Akashavani

Allu Arjun: టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బన్నీ, ఆర్య వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఇతడు.. ఆ పై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

మొత్తానికి బన్నీ టాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగిపోయాడు. ఇక ఇటీవలే సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ద్వారా ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్థాయిలో వెలుగుతున్నాడు. ఇక ఈ సినిమా అంతా ఒక ఎత్తయితే.. ఇందులో పాటలు మరో ఎత్తు అని చెప్పవచ్చు. మొన్నటివరకు పుష్ప సినిమా పాటలు సోషల్ మీడియాలో రీల్స్ రూపం లో తెగ హడావిడి చేసాయి.

నార్మల్ పీపుల్స్ నుంచి సెలబ్రేటీల వరకూ ఈ పాటలకు డ్యాన్సులు చేస్తూ తమ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకునేవారు. ఇదిలా ఉంటే తాజాగా స్కూల్ లో పుష్ప సినిమా పాటలకు విద్యార్థులు డాన్స్ చేయడంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు. ఇంతకి విషయం ఏమిటంటే? ఒడిశాలోని గాంజాం జిల్లాలో బారాముండాలి గ్రామం ఉంది.

ఆ జిల్లా హై స్కూల్ లో పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. స్కూల్ లో స్మార్ట్ క్లాస్ రూమ్ ను టీచర్ల ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఎల్ఈడి టీవీ ద్వారా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక క్లాస్ అనంతరం టీచర్లు రూమ్ కి లాక్ చేయకుండా వెళ్ళిపోయారు. ఇక పిల్లలు ఇంకెక్కడ ఆగుతారు.

Allu Arjun: అల్లుఅర్జున్ వల్ల సస్పెండ్ అయిన స్కూల్ ప్రిన్సిపాల్.. ఏం జరిగిందంటే?
Allu Arjun: అల్లుఅర్జున్ వల్ల సస్పెండ్ అయిన స్కూల్ ప్రిన్సిపాల్.. ఏం జరిగిందంటే?

Allu Arjun: స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయడానికి కారణం ఇదే!

తమ మొబైల్ ఫోన్ ని ఎల్ఈడీ స్క్రీన్ కి కనెక్ట్ చేసి.. పుష్ప సినిమాలోని పాట ప్లే చేసారు. ఇక కొంతమంది స్టూడెంట్ లు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఆ విషయంలో నిర్లక్ష్యం చేసినందువల్ల ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు.

- Advertisement -