Allu Arjun: వరుడు సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నటించిన హీరోయిన్ భాను శ్రీ మెహ్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుడు సినిమాలో హీరోయిన్గా నటించినప్పటికీ ఆ సినిమా ప్లాప్ అవడంతో సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలలో నటించినా కూడా ఈ అమ్మడికి సరైన గుర్తింపు లభించలేదు. ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే గత కొంత కాలంగా ఆమెను బన్నీ బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేయటంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.
కొంతకాలం క్రితం బన్నీ తనను బ్లాక్ చేశాడంటూ.. స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆమె అలా స్క్రీన్ షార్ట్ షేర్ చేయటంతో బన్నీ అభిమానులు ఆమె మీద విరుచుకుపడ్డారు. అయితే బన్నీ కూడా వెంటనే ఆమెను అన్ బ్లాక్ చేశాడు. దీంతో ఆమె సంబరపడిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా బన్నీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ వేసింది. బన్నీ దసరా సినిమాను మెచ్చుకుంటూ చేసిన ట్వీట్ అందరికీ తెలిసిందే. గత వారం బన్నీ చేసిన ఆ ట్వీట్‌కు ఈ అమ్మడు రిప్లై ఇస్తూ.. తన కొత్త వీడియోను చూడమని బన్నీ ని ట్యాగ్ చేసింది. దీంతో బన్నీ అభిమానులు మరొకసారి ఆమె మీద మండిపడుతున్నారు.
Allu Arjun: మా హీరోకి పని లేదనుకున్నావా…
నీకు పని పాట లేక ఇలాంటి వీడియోస్ చేసి మా హీరోని చూడమంటున్నావ్. నీకు పని లేకపోతే మా హీరోకి పని ఉండదా..? నీ వీడియోలు చూసుకుంటూ కూర్చోవాలా? మా హీరో నిన్ను అందుకే బ్లాక్ చేసి ఉంటాడు. అని కొందరు కామెంట్స్ చేస్తుంటే…నిన్ను బ్లాక్ చేసే మంచి పని చేశాడంటూ మరికొందరు..ఇలా వివిధ రకాలుగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ ఆమెను బ్లాక్ చేయటం తప్పు కాదని అభిమానులు బన్నీని సమర్థిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.