Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ అనంతరం ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొంది పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు తాజాగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో ఈయన క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు ఎంతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని మెప్పించే వారట.ఇలా అల్లు అర్జున్ డాన్స్ చూసి ఓ డైరెక్టర్ తనకు వంద రూపాయలు బహుమానంగా ఇచ్చినట్టు తెలుస్తుంది.
మరి అల్లు అర్జున్ కు వంద రూపాయలు బహుమానంగా ఇచ్చిన డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే..మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి పెద్ద వేడుక నిర్వహించారట.ఈ వేడుకలలో భాగంగా చిరంజీవి పిల్లలు అల్లు అర్జున్ వంటి వారంతా కూడా డాన్సులు వేశారు.
Allu Arjun: ఇప్పటికీ వంద రూపాయలు దాచుకున్న బన్నీ…
ఈ విధంగా అల్లు అర్జున్ వేదికపై డాన్స్ చేయడంతో కే రాఘవేంద్రరావు దృష్టి అల్లు అర్జున్ పై పడింది ఈయన డాన్స్ చూసి సంతోషించిన రాఘవేంద్రరావు అల్లు అర్జున్ తల్లి వద్దకు వెళ్లి పెద్దయిన తర్వాత మీ అబ్బాయిని నేనే హీరోగా పరిచయం చేస్తాను అంటూ తనకోసం వంద రూపాయలు ఇచ్చారట.ఈ విధంగా అల్లు అర్జున్ ఇప్పటికీ ఆ వంద రూపాయలను చాలా భద్రంగా దాచుకున్నారని,చెప్పిన విధంగానే రాఘవేంద్రరావు అల్లు అర్జున్ హీరోగా పరిచయం చేశారని చెప్పాలి.