Allu Arjun: టాలీవుడ్ ప్రేక్షకులకు అల్లు అర్జున్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా బన్నీ ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. పుష్ప సినిమా సక్సెస్ అనంతరం బన్నీ మొన్నటివరకు ఒక రేంజ్ లో చిల్ అయ్యాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు బన్నీ శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి, సోషల్ మీడియాలో ఆమె చేసే హడావిడి గురించి మన అందరికీ తెలిసిందే. తండ్రి నటించిన సినిమా డైలాగులు తను ముద్దుగా చెబుతూ సోషల్ మీడియా ప్రియులను మరో లెవెల్లో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక సమంత నటించే శాకుంతలం సినిమాలో కూడా ఈ చిన్నది అడుగులు వేసింది. కాగా ఈ సినిమాలో అర్హ పర్ఫామెన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలని అల్లు ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Allu Arjun: నెటిజన్లు అల్లు అర్హ పై ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు!
ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్హ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఆ ఇంటర్వ్యూలో నీ పేరు ఏమిటి? అని అడుగుతారు. దానికి ఈ చిన్నది అల్లు అర్హ రెడ్డి అని చెబుతుంది. ఇది విన్న పలు నెటిజన్లు ఒక రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు. ఆ ఇంటర్వ్యూలో అర్హ తన పేరు చివర రెడ్డి అని చెప్పుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.
మరికొందరిని నెటిజన్లు పిల్లలకు ఎం నేర్పిస్తున్నారు అంటూ కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. ఇన్ని రోజులు తన ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో ఆకట్టుకున్న అర్హ ప్రస్తుతం పలు నెటిజన్ల నోట్లో నెగిటివ్ గా నానుతుంది. ఏదేమైనా ఆ ఇంటర్వ్యూ లో అర్హ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక రాబోయే జనరేషన్ కి మళ్లీ కులగజ్జి పట్టిస్తున్నారా అంటూ మరికొందరు గుసగుసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.