Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచిది గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి గురించి అందరికీ సుపరిచితమే.ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ లో ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు. దీంతో ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం వీరిద్దరిది ప్రేమ వివాహం అనే విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుని వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో పెద్దల అంగీకారంతోనే అల్లు అర్జున్ స్నేహ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక స్నేహ రెడ్డిని ప్రేమించినటువంటి అల్లు అర్జున్ పెళ్లికి ముందే స్నేహ రెడ్డి పై తనకు ఎంత ప్రేమ ఉందో కానుకల రూపంలో తెలియజేశారు.అల్లు అర్జున్ స్నేహ రెడ్డి నిశ్చితార్థానికి ముందు రోజు అల్లు అర్జున్ ఏకంగా స్నేహ రెడ్డికి లక్షలు విలువ చేసే ఖరీదైన బహుమతులు అందజేశారట.ఈ విధంగా అల్లు అర్జున్ ఇచ్చిన బహుమతులను చూసి అల్లు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.
Allu Arjun: భారీగా ఖర్చు చేసిన బన్నీ…
మరి పెళ్లికి ముందే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కోసం ఎలాంటి కానుకలు కొన్నారు వాటి ఖరీదు ఎంత ఏంటి అనే విషయానికి వస్తే… నిశ్చితార్థానికి ముందే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కోసం ఏకంగా లక్ష రూపాయల విలువైన డిజైనర్ సారీ నిశ్చితార్థం కోసం తనకు కానుకగా ఇచ్చారట అదే విధంగా నిశ్చితార్థంలో వేసుకోవడం కోసం 60 లక్షల రూపాయల విలువచేసే నగలు అలాగే ఒక డైమండ్ రింగ్ తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఇలా తనకు కాబోయే భార్య కోసం లక్షలు విలువచేసే ఖరీదైన కానుకలు ఇచ్చారన్న విషయం తెలియడంతో స్నేహారెడ్డి అంటే అల్లు అర్జున్ కు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.